బంగారు కొనడానికి మంచి అవకాశం…
Gold Price Today: వివాహాది శుభకార్యక్రమాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి బహుశా ఇదే గోల్డెన్ టైమ్లా కనిపిస్తోంది. రోజురోజుకీ తగ్గుతోన్న బంగారం ధరలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బంగారం కొనుగోలు తగ్గడం కారణం ఏదైనా గోల్డ్ ధరలు దిగివస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో ఒకానొక స్థాయిలో తులం బంగారం ఏకంగా రూ. యాభై వేలు దాటిన పరిస్థితులు కూడా చూశాం. అయితే ప్రస్తుతం గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.42,690 (ఆదివారం రూ.42,700) ఉండగా తులం బంగారం కావాలంటే… దాని ధర రూ.34,152 ఉంది, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,570వద్ద (ఆదివారం రూ.46,580)ఉంది.
ఇక దక్షిణ భారతదేశం విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,680 ఉండగా (ఆదివారం రూ.42,690), 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,560 వద్ద ( ఆదివారం రూ.46,570) వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.42,680 ఉండగా (ఆదివారం రూ.42,690), 24 క్యారెట్ల బంగారం రూ.46,560 వద్ద ( ఆదివారం రూ.46,570) ఉంది. సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.46,680 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,560గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రామలు గోల్డ్ ధర రూ.43,310 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,250 వద్ద కొనసాగుతోంది.