మదనపల్లె రెవెన్యూ అధికారుల ఇచ్చిన హామీని అమలు చేయాలి…


Ganesh Tirupati:
మదనపల్లె రెవెన్యూ అధికారుల ఇచ్చిన హామీని అమలు చేయాలి. రెవెన్యూ అధికారుల ఇచ్చిన హామీని అమలు చేయాలి అన్యాక్రాంతమైన భూములను కాపాడాలి
పేదల అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై మదనపల్లి తహసిల్దార్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి మండలం లో ముఖ్యంగా బి కే పల్లి, కోళ్లబైలు రెవిన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయని వివరించారు. జానెడు ఇంటి జాగా కోసం ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే మంది మార్బలంతో దిగిపోయి కూల్చివేసి, కేసులు పెట్టే రెవిన్యూ అధికారులు, ఎకరాలకు ఎకరాల భూమిని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేసే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సిపిఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని బి కే పల్లి రెవిన్యూ గ్రామం లోని ప్రభుత్వ స్థలంలో స్థలాలు ఏర్పాటు చేస్తే, మదనపల్లి తాసిల్దార్ పోలీస్ బెటాలియన్ తో తరలివచ్చి నెల రోజుల్లోపు కుల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారికి వత్తాసు పలకడం దారుణం అన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుండి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించి, అధికారుల స్పందించకపోవడంతో నిరసనగా ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని, ఆ సందర్భంగా మదనపల్లి పట్టణ సీఐల సమక్షంలో నెల రోజుల్లోపు కచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన తహసిల్దార్ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బి కే పల్లి గ్రామం సర్వే నెంబర్ 548 లో ఆక్రమణలు జరుగుతున్నాయని వివరించిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా దారులతో తహసీల్దార్ కు సంబంధాలు ఉండడం వల్లనే స్పందించలేదని ఆరోపించారు. సబ్ కలెక్టర్ గారు చేసి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి భారతీయ అంబేద్కర్ సేన నాయకులు శ్రీ చందు, మల్లెల మోహన్ లు మద్దతుగా పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జెసి తో సంప్రదింపులు జరిపి భూకబ్జాల పైన చర్యలు తీసుకుంటామని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు కు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.నాగరాజు, పి.రమణ, వి.చంద్రశేఖర్, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కమిటీ నాయకులు రమేష్, ఉమాపతి, రామకృష్ణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

About The Author