ఆకాశం నుంచి పడిన అంతుచిక్కని వస్తువు…


ఆకాశం.. సూర్యుడు.. చంద్రుడు.. నక్షత్రాలు.. తోక చక్కలు.. మనం పైకి చూస్తే కనిపించేవి ఇవే. కానీ ఈ అనంత విశ్వంలో మనకు తెలియని అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నాయి. అందుకే విశ్వం రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేస్తున్నారు. ఆకాశంలోకి రాకెట్లను పంపి ఇతర గ్రహాల గురించి తెలుసుకున్నారు. అందుకే ఆకాశమన్నా.. అంతరిక్షమన్నా.. అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఐతే ఈ అనంత విశ్వానికి సంబంధించి కరీబియన్ దీవుల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి ఓ భారీ వస్తువు ఒకటి కిందపడింది. బాహమాస్ తీరంలో ఇది లభ్యమైంది.

అందమైన కరీబియన్ దీవుల్లో బాహమాస్ ఒక దేశం. బ్రిటన్‌కు చెందిన మనోన్ క్లార్క్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం.
అందుకే ఈ భూమిపై ఉన్న అందమైన ప్రదేశాల్లో తిరుగుతుంది. ఇటీవల బాహమాస్‌లో కూడా పర్యటించింది. ఫిబ్రవరి 24న హార్బర్ ఐలాండ్‌లోని బీచ్‌ల్లో విహరిస్తుండగా సముద్ర తీరంలో ఓ వింత వస్తువు కనిపించింది. అంతకు ముందు ఆమె అలాంటి వస్తువును ఎప్పుడూ చూడలేదు. అది చూడటానికి గుండ్రంగా ఉండి బంతిలా మెరుస్తోంది. కానీ చిన్నది కాది. దాని బరువు 41 కేజీలు ఉంది. ఆ లోహపు బంతిపై రష్యన్ భాషలో ఏదో రాసి ఉంది. ఆ వస్తువును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

About The Author