దివాలా దిశగా ఆంధ్రప్రదేశ్‌… రఘురామకృష్ణరాజు


దిల్లీ: రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా పరుగులు తీస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. కాగ్‌ నివేదిక ప్రకారం.. పది నెలల కాలానికి రూ.73,912 కోట్ల అప్పు చేసి వైకాపా ప్రభుత్వం దేశంలోనే రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను స్పీకర్‌కు అందజేశారు.

‘గత ఏడాది కాలంలో దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. రాష్ట్రం 35 శాతం ద్రవ్యలోటులో ఉంది. మామూలుగా 5 శాతం దాటకూడదని ఆర్థిక నిపుణులు చెబుతారు.
రాష్ట్రంలో ఉన్న పోర్టుల్లో అభివృద్ధి కనబడటం లేదు కాని.. కొత్తగా మూడు పోర్టులు కడతామని ప్రభుత్వం చెబుతోందని’ అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

About The Author