అధ్బుతాలకు నెలవు అంతరిక్షం.


అధ్బుతాలకు నెలవు అంతరిక్షం. గుర్తించాలే గానీ లెక్కలేనన్ని విశేషాలు వెలుగు చూస్తాయి.

తాజాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్షానికి సంబంధించి అద్భుతమైన ఫోటోను ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతిపెద్ద, అందమైన గెలాక్సీకి(NGC 2336) సంబంధించిన ఫోటోను నెటిజన్లతో పంచుకుంది. నీలి వర్ణంలో కాంతులీనుతున్న ఆ పాలపుంతలో తెల తెల్లగా మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. చిమ్మ చీకటికి తోడు.. నీలి కాంతి ప్రసరిస్తుండటంతో ఆ పాలపుంత చూడటానికి అద్భుతంగా కనిపిస్తోంది. ఇక ఆ పాలపుంత మధ్యలో సూర్యుని వలే అతిపెద్ద నక్షత్రం ఎర్రగా భగభగలాడుతూ సదరు గెలాక్సీలో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

About The Author