పోలీసులు నాకు పెళ్లి చెయ్యాల్సిందే.


పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరక్క విసిగిపోయిన ఓ మరుగుజ్జు, చివరకు పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకి పెళ్లి చేయనిదే పోలీస్ స్టేషన్ నుంచి కదలను అంటూ మొరాయించాడు. ముఖ్యమంత్రికి కూడా తన బాధలను లేఖ ద్వారా తెలియజేశానని, అయినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అజీమ్ మన్సూరి అనే 26ఏళ్ల యువకుడికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరడంలేదు. ఉత్తర ప్రదేశ్ ఖైరానాకి చెందిన అజీమ్ మన్సూరి కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.గత 5 ఏళ్లుగా అమ్మాయిలకోసం లక్షలు ఖర్చు పెట్టి వెదుకుతున్నాడు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటానన్నా, ఎవరూ ముందుకు రావడంలేదని ఆవేదన్ వ్యక్తం చేశాడు. అన్ని రకాల ప్రయత్నాలు విఫలం అయిపోయాయి. అందువల్ల పోలీసులైనా తన బాధ ఆలకించి తనకు అమ్మాయిని వెదికి పెట్టాలని, పెళ్లి చేయాలని కోరుతున్నాడు. కాస్మొటిక్స్ వ్యాపారం చేస్తున్న అజీమ్ మన్సూరి తాను బాగా సంపాదించి, భార్యను బాగా చూసుకోగలనని చెబుతున్నాడు.రాత్రులపూట తనకు నిద్ర పట్టడంలేదని చెబుతున్నాడు. ముఖ్యమంత్రిని కూడా స్వయంగా కలుసుకున్నానని, ఆయన కూడా సహాయం చేస్తానన్నారని, తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబం కూడా తన పెళ్లి గురించి పట్టించుకోలేదని అన్నాడు. ఇప్పటికి చాలాసార్లు కలెక్టర్లను, ఎస్పీలను కలసి తన బాధ చెప్పుకున్నానని, ఇకనైనా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగిన అమ్మాయిని వెదికిపెట్టాలని కోరుతున్నాడు. ఇది కూడా ప్రజా సేవ కిందకే వస్తుందని చెబుతున్నాడు.

About The Author