ఓ కుర్రాడితో ఆంటీ మర్డర్ ప్లాన్..


అక్రమ సంబంధం మోజులో ఓ ఆంటీ ,భర్తను చంపించే ప్రయత్నం చేసింది. అది వికటించి ఇప్పుడు చిక్కిపోయింది. భీంరాజ్ అనే వ్యక్తి , భార్య భాటియాతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. భర్త వయసు 45, ఆమె వయసు 41 ఏళ్ళు.. ఇటీవల ఆమెకు 23 ఏళ్ళ రోహన్ తో పరిచయం , అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భీంరాజ్ , భార్యను మందలించాడు. అయినా ఆమె తప్పేది పని మానలేదు. ఇద్దరిమధ్య అక్రమసంబంధం మరింత ముదిరింది.భర్త మందలింపు కూడా ఎక్కువ కావడంతో , భాటియా , భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు రోహన్ కు చెప్పింది. దీంతో రోహన్ భీంరాజ్ను చంపేందుకు పధకం పన్నాడు. ఒక తుపాకీ కొని , బైక్ నంబర్ ప్లేట్ కూడా మార్చాడు. బుధవారం భీంరాజ్ కారులో పోతుండగా , బైక్ లో పోతూ , కాల్పులు జరిపాడు. సిసి కెమెరాలో రికార్డయిన బైక్ నంబర్ తెలుసుకోలేక పోలీసు సతమతం అవుతున్న పరిస్థితుల్లో , భాటియా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న పోలీసులు , కాల్పులు జరిగిన టైంలో రోహన్ , సెల్ సిగ్నల్స్ , కాల్ రికార్డ్స్ పరిశీలించి అసలు కుట్రను వెలుగులోకి తెచ్చారు. రోహన్ ను, ప్రియురాలు ఆంటీ భాటియాను అరెస్ట్ చేశారు. భీంరాజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

About The Author