బాలుడి కిడ్నాప్ సుఖాంతం..క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత


*కేసులో అహర్నిశలు శ్రమించిన పోలీస్ బృందాలకు హార్థిక అభినందనలు*
*తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ సి.హెచ్.వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…*

 *గత నెల 27 న తిరుపతి లో కిడ్నాప్ అయిన ఆరేళ్ళ బాలుని ఆచూకి లభ్యం.*

 *బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగిస్తున్న తిరుపతి పోలీసులు.*

 *కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిస్థాయి ప్రయత్నాలు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు.*

 *బాలుడి ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో గాలింపు చర్యలు.*

 *బాలుడి క్షేమమే లక్ష్యంగా శ్రమించిన పోలీసు అధికారులు, ఫలించిన పోలీసు అధికారుల వ్యూహం, పోలీసు బృందాల తీవ్ర గాలింపుతో కిడ్నాపర్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన పోలీసులు. విజయవాడలో బాలుడి ఆచూకి లభ్యం. అన్నివైపుల నుండి గాలింపు చర్యలు కొనసాగటం వలన విజయవాడలో బాలుడిని వదలి, కిడ్నాపర్ పరారైనట్లు భావిస్తున్న పోలీసులు.*

 *అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేసిన పోలీసులు.*

 *కేసు దర్యాప్తు ద్వారా కిడ్నపర్ ది పుట్టేనహళ్లి గ్రామం, ముళబాగులు తాలుక, కోలార్ జిల్లా, కర్నాటక రాష్ట్రం గా భావిస్తున్న పోలీసులు.*

 *పరారైన కిడ్నాపర్ కోసం కొనసాగుతున్న ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు.*

బాలుడిని కనుగొనే విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ కమిషనర్ విజయవాడ, బస్తర్ రేంజ్ ఐ.జి.పి శ్రీ సుందర్ రాజ్ ఐ.పి.యస్, గరియాబాద్ యస్.పి, కర్నాటక రాష్ట్రం మరియు తమిళనాడు రాష్ట్ర పోలీస్ అధికారులకు అలాగే చిత్తూర్ జిల్లా యస్.పి, పలమనేరు, వి.కోట, కుప్పం, భైరెడ్డి పల్లి పోలీస్ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకున్నారు.

మరీ ముఖ్యంగా ఈ విషయమై విలువైన సమాచారం అందించి సహకరించిన మదనపల్లికి చెందిన శ్రీ రవి Ex army, బాల క్రిష్ణ (కుప్పం బస్ డిపో) తిరుపతి జీవకోనకి చెందిన ప్రకాష్ లకు మరియు ప్రజలకు అలాగే ఈ సంఘటనపై విశేష ప్రచారం కల్పించి బాలుడి ఆచూకీ కొరకు సహకరించిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా పోలీసులపై విశేషమైన నమ్మకం ఉంచి సహకరించిన తల్లి దండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఇన్వెస్టిగేషన్ సిబ్బంది హెచ్.సి లు దేవరాజుల రెడ్డి, మదన కుమార్, పి.సి లు ప్రసాద్, రాజశేఖర్, రవిరెడ్డి, దినకర్, యస్.ఐ లు షేక్షావలి, శివాజీ, నరసింహ, నాగేంద్ర బాబు, వీరేష్, ప్రవీణ్ కుమార్, సి.ఐ లు దేవేంద్ర కుమార్, సురేష్ కుమార్, డి.యస్.పి లు కొండయ్య కమాండ్ & కంట్రోల్, ఎల్.సుధాకర్ సి.సి.యస్ తిరుమల, టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించిన జిల్లా యస్.పి గారు.

గత నెల 27 న తిరుపతిలో సంచలనం సృష్టించిన ఛత్తీస్ గఢ్ బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఆదివారం నాడు తిరుపతి పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

గత నెల 23 వ తేదిన ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చేయండిన సుమారు 50 మంది యాత్రికులు ఒక్క బస్సులో బయలుదేరి ఆంధ్రాలో వివిధ పుణ్యక్షత్రాలను దర్శించుచూ 27వ తేదీన అలిపిరి లింక్ బస్ స్టాండ్ కు వచ్చి విశ్రాంతి తీసుకొంటూఉండగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో అందరు భోజనాలు చేస్తూ ఉండగా వారి పిల్లలలో ఒక్కరిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు అలిపిరి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా దీనిపై కేసు దర్యాప్తులో అనేకమైన ఆధారాలను అధ్యాయనం చేసుకుని లోతుగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో బాలుడి ఆచూకీకై ప్రయత్నిస్తుండగా సదురు తప్పోయిపోయిన బాలుడు విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు రాబడిన సమాచారంపై సదరు బాలుడిని అక్కడి పోలీస్ అధికారులను సంప్రదించి తిరుపతికి తీసుకువచ్చి ఈ దినము వారి తల్లిదండ్రులకు బాలుడిని క్షేమంగా అప్పగించడమైనది.

About The Author