గోవును వదలుకుని ఏమి పోగొట్టుకున్నామో తెలుసా..??


వ్యవసాయ భూమిలోకి
గోమయము (ఆవు పేడ) వెళ్ళాలి. అలా ఆవుపేడ భూమికి అందకపోతే ఏమిజరుగుతుందో, ఎంత నష్టం జరుగుతున్నదో తెలిస్తే ఆశ్చర్య పోతాము..

912,30,00,000 Kg (912 కోట్ల కేజీలు). ఇది
2019 20 సంవత్సర కాలంలో భారతదేశము
దిగుమతి చేసుకొన్న యూరియా పరిమాణము..

దిగుమతి చేసుకొన్న యూరియా విలువ
Rs.161206,50,00,000 ( సుమారుగా 1.61 లక్షల కోట్లు )

రైతు దగ్గర, వ్యవసాయము చేయు వారి దగ్గర ఆవు లేకపోవడమే దీనికి కారణము..

మనదేశ సంవత్సర బడ్జెట్ సుమారుగా 20 లక్షల కోట్లు. యూరియా దిగుమతి కోసము బడ్జెట్ లో 8 వ వంతు అయిపోతుంది..

2025 సంవత్సరము వచ్చే నాటికి, ఇప్పటికి ఉన్న యూరియా దిగుమతులను కనీసము 30 శాతానికి తగ్గించలేమా..??

(పాడి-పంట) ను కలిపి ఉంచుదాము. ఆర్ధిక, ఆరోగ్య సాధికారతను సాధించుకొందాము..

పశువుల ఎరువులు ఏవైనా మట్టిలో నత్రజనిని ఇంకా ఇతర పోషకాలను పెంచుతాయి..

అయితే గోమయము (ఆవు పేడ) తక్కువ సమయములో ఎక్కువ సారవంతమైన మట్టిని తయారు చేస్తుంది.. మట్టిలోని సారమును పెంచుట, మట్టిలోని జీవ వైవిద్యమును కాపాడుట, మట్టి లోని కాలుష్యమును నియంత్రించుటలో ఆవు పేడకు సమానమైనది ఇంకొకటి లేదు..

అందుకే సనాతన ధర్మం “గోమయే వసతే లక్షీ..” అని చెబీతున్నది. అంటే లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండదు, బంగారు దేవాలయంలో ఉండదు, బంగారుతో చేయించిన పూజామందిరంలో ఉండదు. మరి ఎక్కడ ఉంటుందంటే గోమయంలో ఉంటుంది. అంటే ఆవు పేడలో ఉంటుంది….!!
జై భారత్ ??జై హింద్

About The Author