యాదాద్రిని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి ఎవరో తెలుసా..?
ఘన చరిత్ర.. యాదాద్రిని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి ఎవరో తెలుసా..?.
ఈ పంచ నారసింహ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. జాతీయ స్థాయి నాయకులు స్వయంభువై వెలిసిన లక్ష్మినారసింహుని దర్శించుకున్నారు. స్వతంత్ర భారతావని తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1958లో తొలిసారిగా యాదగిరిగుట్టకు వచ్చారు. తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి స్వామి ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత కాలంలో.. మరో ముగ్గురు రాష్ట్రపతులు యాదగిరిగుట్టను దర్శించుకున్నారు. 1963లో సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చారు. 1995లో శంకర్ దయాళ్ శర్మ యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. 2015 జులై ఐదు ఆదివారంరోజున…. అప్పటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, తన కుమారుడు అభిజిత్ ముఖర్జీతో కలిసి యాదగిరి గుట్టకు వచ్చారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీతో కలిసి నర్సన్న స్వామిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్టను దర్శించుకున్న భారత రాష్ట్రపతులు
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1958
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1963
శంకర్ దయాళ్ శర్మ 1995
ప్రణబ్ ముఖర్జీ 2015