ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు


పిల్లలకు విధ్యా బుద్ధులు నేర్పించాల్సిన తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాలల్లో పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా దేవుళ్లను నమ్మొద్దని అని వారితో ప్రమాణాలు చేయిస్తూ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఎం వెంకట రమణ శర్మ బృందం నాంపల్లి లోని రాష్ట్ర మనవాహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….చిన్న పిల్లల మనసులో ద్వేషాలు నింపుతున్న ప్రవీణ్ కుమార్ ను తొలగించలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో ప్రవీణ్ కుమార్ వ్యవహారం పై రాష్ట్ర గవర్నర్ ను కలుస్తామని వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతాచార్యులు, మంగపతి గారు, గోగులపాటి కృష్ణమోహన్, మల్లాది చంద్రమౌళి, నరేష్ కులకర్ణి, హిందూ ధర్మ చక్రం శ్రీకాంత్ పాల్గొన్నారు

About The Author