భగవంతుడు… మనిషి అజ్ఞానాన్ని చూసి, రెండు సార్లు నవ్వుతాడంట.


1.ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యంచేస్తూ, వైద్యుడు వాళ్ళ తల్లితో ఏమీ భయం లేదమ్మా,

మీ అబ్బాయికి ఏమి కాదు. నేను బ్రతికిస్తాను అని అన్నప్పుడు.

2.ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని…
*ఇదిగో ఈభూమి నాది. అదిగో అటువైపు వున్నది నీది అని అన్నప్పుడు.*

*వీడి తండ్రి, తాత, ఇదే మాట అన్నారు, పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు. రేపు వీడూ పోతాడు. అయినా ఇది నాది అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట.*

*నిజమే… ఏదీ శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇళ్ళు, భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవీ మన వెంట రావు.*
*ఈ విషయం మనకందరికీ* *తెలుసు. అయినా నాది, నావి అనే మాయలోనే ఉండిపోతున్నాము.*

*ప్రతి రోజూ తెల్లవారుతోంది.* *పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు నిద్రపోవడం ఎన్నాళ్ళిలా ? ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. తాగిందే తాగుతున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం.* *అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు. ఏమాత్రం అర్ధంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి ? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒక రోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.*

*ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి ? ఈ ఆరాటం దేనికి ? మనలో ఏర్పడి ఉన్న ఈ నాది – నావి – నావాళ్ళు అనే భ్రమంతా మనకు ఎక్కడినుంచి వచ్చింది ? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం ?*

*డబ్బు సంపాదించాలి. దాన్ని భద్రంగా దాచుకోవాలి. అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి అని ఆలోచిస్తారు.*
*ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.*

*ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు, ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను అని తెలుసుకున్న రోజు, ఆత్మ జ్ఞానం మనలో ఉద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం, దాని తరువాత భగవంతుని దర్శనభాగ్యం, చివరిగా ముక్తి.*

*మనం కోరుకునే జ్ఞానం, ముక్తి, మరెక్కడో లేదు. మన మనస్సులోనే ఉంది.*

సేకరణ మానస సరోవరం

About The Author