న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్…
ఫేస్‌బుక్‌తో వల వేసి.. వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసి.. స్క్రీన్ రికార్డింగ్‌తో న్యూడ్ వీడియోలు రికార్డు చేసి.. అందినకాడికి దండుకునే ముఠాలు నానాటికీ రెచ్చిపోతున్నా యి. సెక్స్‌టార్షన్‌గా పిలిచే ఈ నేరాలకు సంబంధి చి నగర సైబర్ క్రైమ్ ఠాణాకు దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ ఫిర్యాదు వస్తోంది. తాజాగా ఇలాంటి గ్యాంగ్ వల్లో పడి రూ.10 లక్షలు నష్టపోయిన తార్నాకకు చెందిన ఈవెంట్ మేనేజర్ శుక్ర వారం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తార్నాక ప్రాంతానికి చెందిన ఈవెంట్ మేనేజర్‌కు కొన్నాళ్ల క్రితం ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ‘ఆమె’ ఫ్రెండ్‌గా మారిపోయింది.
కొన్నాళ్ల పాటు సదరు ‘యువతి’ మెసెంజర్‌లో చాటింగ్ చేసింది. ఆ తర్వాత సెక్స్ చాటింగ్ మొదలు పెట్టి వాట్సాప్ నెంబర్ తీసుకుంది. ఇంటర్‌నెట్ సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్‌లో ఉంచి నగరవాసికి ప్లే చేసి చూపా రు. దీంతో ఇతగాడికి ఆ ‘యువతి’ తనతో మాట్లాడుతూ నగ్నంగా మారిన భావన కలిగింది. దీంతో అతను పూర్తిగా సైబర్ నేరగాళ్ల వల్లో పడిపోయాడు. ఇలా ఒకటిరెండు సార్లు వీడియోలు చూపించిన సైబర్ నేరగాళ్లు ఆపై మాటల్లో దింపి నగర ఈవెంట్ మేనేజర్ సైతం అలానే చేసేలా చేశారు. ఈ దృశ్యాలను స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా రికా ర్డు చేశారు. వీటిని యూట్యూబ్ చానల్‌లో ఉంచిన లింకుల్ని బాధితుడికి పంపారు.
ఇవి చూసి కంగుతిన్న అతగాడు తొలగించాలంటూ కోరాడు. దీనికి రూ.10 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ చేశారు. ఆపై కొన్ని రోజులకు మరికొంత మొత్తం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.