శ్రీ గోవింధ రాజ స్వామి ఆలయంలోగల హుండిలో చోరికి ప్రయత్నించిన కేసును చేధించిన తిరుపతి జిల్లా పోలీసులు


శ్రీ గోవింధ రాజ స్వామి ఆలయము లోపల ద్వజస్తంభం ప్రక్కన హుండీ ఉన్నది. 26-3-2021 వ తేది నాడు రాత్రి సమయంలో గుడి లోపల గల పరకామని ప్రక్కన దాగి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్వజస్తంభం ప్రక్కనున్న హుండీ దగ్గరికి వచ్చి హుండికి ఉన్న తాళంకు వేసిన గుడ్డ సీల్ ను తీసివేసి ప్రక్కన ఆవరణంలో ఉన్న తాళం చెవిలను తీసుకొని వచ్చి హుండీ తాళం తీయడానికి ప్రయత్నించి విఫలమైనాడు. దాని పై టి.టి.డి విజిలెన్స్ వారు ఇచ్చిన ఫిర్యాదు పై ఈస్ట్ పోలీసు స్టేషన్ క్రైమ్ నెంబర్ 118/2021 u/s 380 r/w 511 IPC క్రింద కేసు నమోదు చేయడమైనది.

జిల్లా యస్.పి శ్రీ సి.హెచ్.వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే ప్రత్యేక టిమ్ లను ఏర్పాటుచేసి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆలయ ప్రాంగణంలోని సి.సి. కెమరాలతో పాటు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మొదలగు ముఖ్యమైన ప్రదేశాల యందు గల సి.సి కెమరాలను పరిశీలించి అందులో ముఖ్యమైన ఆధారాలతో ప్రత్యేక టీం లు ఈ రోజు మధ్యహనం శ్రీ గోవిందరాజ స్వామి పుష్కరిణి వద్ద ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగినది. అతని గురించి విచరిస్తే నిన్న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగిన హుండీలో దొంగ తనం చేయాడానికి ప్రయత్నించిన వ్యక్తి తనేనని చెప్పినాడు. తదుపరి పూర్తి స్థాయిలో విచారించి సదరు వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు.

సదరు చోరికి పాల్పడిన వ్యక్తిని 24 గంటలులోనే పట్టుకొన్న పోలీస్ కానిస్టేబుల్ లు 1133 బారుష, 2061 దినకర్, యస్.ఐ బాల కృష్ణ లను జిల్లా యస్.పి గారు అబినందించినారు.

ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు ఈస్ట్ మురళీకృష్ణ, క్రైమ్ మురలిదర్, యస్.సి యస్.టి సెల్ కాటమరాజు, సి.ఐ శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

About The Author