నీటిలో తేలిన ఎవర్ గివెన్ నౌక !
ఈజిప్ట్ యొక్క సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద కార్గో షిప్ – ఎవర్ గివెన్ దాదాపు వారం తర్వాత తిరిగి మళ్ళీ నీటి మీద తేలిందని చివరకు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గం నుంచి అది తప్పుకోనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది . 400 మీటర్ల పొడవు ( 1,312 అడుగులు ) మరియు 200,000 టన్నుల బరువు , గరిష్టంగా 20,000 కంటైనర్ల సామర్థ్యం కలిగిన ఎవర్ గివెన్ ప్రస్తుతం 18,300 కంటైనర్లను తీసుకువెళుతుంది .
అయితే బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం , ‘ ఓడ మళ్లీ తేలినా సరే ఈ జలమార్గం నుండి ఎంత త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేస్తారో తెలియదని 450 కి పైగా నౌకల లాగ్ జామ్ ను క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వెంటనే తెలియదని పేర్కొంది .
ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గమైన ఈజిప్టు సూయజ్ కాలువలో ‘ ఎవర్ గివెన్ ‘ అనే పెద్ద కంటైనర్ ఇరుక్కు పోయింది . ఎంపైర్ స్టేట్ భవనం అంత ఎత్తుగా ఉన్న ఈ ఓడ , బలమైన గాలులు , ఇసుక తుఫాను కారణంగా ఇరుక్కుందని సూయజ్ కెనాల్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది .