మూత్రపిండాలలో రాళ్ళు (కిడ్నీ లో రాళ్లు) సమస్య పూర్తి వివరణ :
?మూత్రపిండాలు( కిడ్నీ) లో ఏర్పడే గట్టి పదార్ధాలను మూత్రపిండాలలో రాళ్ళు అని అంటారు.
?సాధారణంగా ఈ రాళ్ళు మూత్రపిండాల లోపల ఏర్పడతాయి. ఒకటి కన్నా ఎక్కువ రాళ్ళు కూడా ఏర్పడతాయి.
? మూత్రాశయం, మూత్రనాళాలలో కూడా ఈ రాళ్ళు ఏర్పడతాయి. 20-30 సం. వయస్సు నుండి ఈ రాళ్ళు ఏర్పడతాయి.
?అధికశాతం కాల్షియం రాళ్ళు ఏర్పడతాయి.
కాల్షియం పదార్ధము – ఇతర ఆక్జలేట్లు ఫాస్పేట్లు, కార్బోనేట్ లవణాలతో కలిసి మూత్రపిండాల రాళ్ళుగా ఏర్పడతాయి.
✍️ఎలా ఏర్పడతాయి:
?రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి.
? అధికంగా వున్న లవణాలు స్పటిక రూపంగా మూత్రపిండాల పొరలలో ఆకారాలు మారుతూ నిలువ ఉంటాయి.
?కొన్ని సందర్భాలలో మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షన్ కారణంగా రాళ్ళు ఏర్పడతాయి.
?మూత్రపిండాలు, మూత్ర నాళము, మూత్రాశయ భాగములలో ఇసుక రేణువు సైజు మొదలుకొని ఒక మోస్తరు సైజు వరకు ఈ రాళ్లు ఏర్పడతాయి.
? యూరిక్ యాసిడ్ పురుషులలో అధికంగా ఏర్పడతాయి.
✍️లక్షణాలు:
?వీపు క్రింది భాగములో తీవ్రమైన నొప్పి మొదలై పొత్తికడుపుకు వ్యాపించి, వృషణాలు, పురుషాంగము లేక స్త్రీ జననేంద్రియం వరకు వ్యాపిస్తుంది.
?ఈ విధంగా వ్యాప్తి చెందే నొప్పిని ఫాఇన్ టు గ్రాఇన్ (FOIN To GROIN) నొప్పిగా పరిగణిస్తారు.
?వాంతి వచ్చినట్లుగా ఉండడం, వాంతులు కావడం ఉంటుంది.
?మూత్రపిండాలలో రాళ్ళు ఆయా భాగాలలో కదలకుండా ఉన్నంత కాలము – నొప్పికాని, బాధను కాని కలిగించవు.
?సైజులో ఎంత చిన్నరాయి అయినా మూత్రపిండము నుంచి మూత్రాశయము లోనికి జారుతున్నపుడు, సున్నితమైన పొర దెబ్బ తినడం, మొదలు పెట్టగానే భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది.
?వణుకుతో కూడుకున్న జ్వరంతోపాటు వాంతులు
మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట ఉంటుంది.
?మూత్రం రక్తంతో కలిసి వస్తుంది.
?ఎక్కువ సార్లు మూత్రము పోవాలనిపిస్తుంది.
?మూత్రం వెళ్ళాలి అంటే భరించరాని నొప్పి వస్తుందన్న భయం.
?సాధారణ కడుపు నొప్పి నుండి- భరించరాని కండరాలు వద్ద పిండినట్లుగా నొప్పి వస్తుంది.
✍️పరీక్షలు:
?అల్ట్రాసౌండు – కడుపు పరీక్షలు.
?ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్).
?‘ఎక్స్’ రే కడుపు మూత్రనాళము – మూత్రాశయ భాగాలు.
?యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
మూత్ర పరీక్షలు.
✍️మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
?మంచి నీళ్ళు అధికంగా తీసుకోవాలి.
? అలా ధారాళంగా నీరు త్రాగితే మూత్రము పలుచబడి, ఉప్పు, ఖనిజ లవణాలు కాన్ సెంట్రేట్ కాకుండా ఉండి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి
?రోజుకు సుమారు 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగటం మంచిది. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ త్రాగవలసిన అవసరం ఉంటుంది.
?పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉంటుంది. కాబట్టి, వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి.
?కాల్షియం తో కూడిన మందుల వాడకం తగ్గించాలి.
?విటమిను A అధికంగా వున్న సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి.
?శారీరకంగా చురుకుగా వుండి, రోజు సుమారు ½ గంటలు వ్యాయామం లేదా నడక చేయాలి.
?మాంసకృత్తులు అధికంగా వున్న మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. యూరిక్ ఆసిడ్, కాల్షియం, ఫాస్ఫరస్ పదార్ధాలు అధికంగా ప్రోటీన్ ఆహారం ద్వారా తయారవుతాయి.
?విటమిన్ C విటమిన్ D మాత్రలు డాక్టరు సలహా ప్రకారమే వేసుకోవాలి. వీటిని అధికంగా
తీసుకోవడం వలన కాల్షియం ఆక్జలేటు రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది.
?మాంసంలోని లివరు, కిడ్నీ, మెదడులలో యూరిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండ వ్యాధుల వారు ఈ ఆహారం తీసుకోరాదు.
✍️దీర్ఝకాలికంగా మూత్రపిండాలు పనిచేయకపోవడం:
?మూత్రపిండాలు నిర్వహించే విధులను క్రమేణా, దీర్ఝకాలికంగా నిర్వహించ లేక పోవడాన్ని దీర్ఝకాలికంగా మూత్రపిండాలు పనిచేయకపోవడం అంటారు. దీనినే కిడ్నీఫెల్యూర్ అని, సి.ఆర్.ఎఫ్ అని కూడా అంటారు.
?రక్తములోని వ్యర్ధ పదార్ధాలను వడకట్టలేక పోయినపుడు,
?మూత్రం ద్వారా సరిగా విసర్జించ లేక పోయినపుడు,
? శరీరంలో ఉప్పును మరియు నీటిని తగు పాళ్ళలో సమం చేయలేకపోయినప్పుడు,
?శరీరంలో రక్త పోటును క్రమబద్దీకరించ లేకపోయినప్పుడు,
?మూత్రపిండాలు పనిచేయడం లేదని – దీనినే మూత్రపిండాలు పనిచేయకపోవడం – కిడ్నీఫెల్యూర్ అని అంటారు. కిడ్నీలు సాధారణ స్ధితికి రాలేనంతగా చెడిపోతాయి.
✍️కారణాలు:
?మూత్రపిండాలకు వచ్చే దీర్ఝకాలిక వ్యాధుల వలన క్రమేణా మూత్రపిండాలు పనిచేయకుంటే చెడిపోతాయి.
?దీర్ఝకాలిక అధిక రక్త పోటు
మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు
మూత్రపిండాలలో రాళ్ళు, గడ్డలు, ప్రోస్టేట్ గ్రంధి పెద్దది కావడం వలన మూత్ర ప్రవాహానికి ఆటంకం కలిగించి దీర్ఝకాలిక వ్యాధులు కలుగుతాయి. వీటి వలన కూడా మూత్రపిండాలు పనిచేయ లేకపోతాయి.
?అనేక సంవత్సరాలుగా నొప్పి తగ్గించే మందులు వాడుతున్నా, డాక్టరు సలహా లేకుండా యాంటిబయాటిక్స్ ని వాడటం లాంటివి చేస్తున్నా కూడా కిడ్నీఫెల్యూర్ సంభవించడానికి అవకాశం ఉంది.
✍️లక్షణాలు:
?కారణము తెలియకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం,
?వాంతులు వచ్చునట్లు అనుభూతి కలగడం మరియు వాంతులు రావడం,
?తలనొప్పి, నీరసం, మాటిమాటికి ఎక్కిళ్ళు రావడం,
?కాళ్ళు, ముఖం వాపు,
?మూత్రం ద్వారా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ విసర్జించబడి, రక్తంలో ప్రోటీన్ల శాతం తగ్గిపోతుంది.
రక్త పోటు పెరుగుతుంది,
?మాటిమాటికి మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్ కు గురికావడం,
?నీళ్లు ఎక్కువగా త్రాగినా మూత్రం రాకపోవడం,
?శ్వాస చెడువాసన రావడం,
?చర్మము విపరీతంగా దురద పుట్టడం.
పై లక్షణాలు తొలిదశలో వున్నప్పుడే డాక్టరును సంప్రదించి వైద్యసలహా పొందాలి. అశ్రద్ద చేస్తే క్రమేణా కోమాలోకి వెళ్ళి మరణం సంభవించవచ్చును.
✍️కిడ్నీఫెయిల్యూర్ మూలంగా వచ్చే అనర్ధాలు:
?తీవ్ర రక్తపోటు
?రక్త హీనత
?నరాల అస్వస్ధత
?కండరాల అస్వస్ధత మొదలైన సమస్యలు వస్తాయి.
✍️పై తెలిపిన సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి మాకు మీ సమస్య తీవ్రత వివరాలు మాకు తెలుపండి. మా వద్ద మీకు మంచి పరిస్కారం తప్పకుండా చూపబడుతుంది.
?మీ సమస్య ఏదైనా సరే మాకు తెలపండి. మీ సేవల కోసం మా సిబ్బంది 24×7 అందుబాటులో ఉంటారు. మీ ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తాము. మీ ఆరోగ్యానికి మేము అండగా ఉంటాము.. మీ ఆరోగ్యానికి మేము భరోసా ఇస్తాము. ఆసక్తి ఉన్నవారు ఇపుడే మీ వివరాలు కామెంట్ ద్వారా కానీ, మెస్సెంజర్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయగలరు.
మా వాట్సాప్ :9705569901
సదా మీ సేవలో….
మీ ఆయుర్వేద అమృతం?
చివరిగా ఒక విన్నపం: ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు.. కానీ ఇంకొకరికి అవసరం అయిఉంటుంది. అందుకే దయచేసి షేర్ చేయండి.