కరోనా ప్రభావం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై కూడా పడింది.
కరోనా ప్రభావం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై కూడా పడింది.
దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలను ఉత్తరాఖండ్ సర్కార్ కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మైక్‌ల ద్వారా ప్రకటించడం సహా.. ఘాట్ల వద్ద శానిటైజేషన్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
ఇంకా.. కుంభమేళా పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు 72 గంటలలోపు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పిస్తే కానీ అనుమతించటం లేదు.
ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కుంభమేళాలో తొలిరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.
గతంలో ఎప్పుడైనా కుంభమేళా ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడేవి. ఈసారి అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఘాట్లలో భక్తుల రద్దీ నామమాత్రంగానే ఉంది.
సాధారణంగా కుంభమేళా నాలుగు నెలలపాటు జరిగేది. కానీ, కొవిడ్ కారణంగా ఈసారి నెలరోజులకే ముగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.