పెరుగుతో 3 రోజులు ఇలా తింటే కీళ్లనొప్పులు పరార్… సింపుల్ ఆరోగ్య చిట్కా
కీళ్ల నొప్పులు చాలా మందిని ముఖ్యంగా పెద్దవాళ్లను ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని తగ్గించుకోవడానికి మందులు వాడే కంటే ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది.
సరైన వ్యాయామం, ఆహార నియమాలు పాటించకపోతే… కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. తొలిదశలోనే వాటిని తగ్గించుకుంటే మంచిది. లేదంటే అవి అస్థియోపోరోసిస్ (osteoporosis)కు దారితీస్తాయి. ఐతే… ఈ బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అందువల్ల పెద్దవారే కాదు… నడి వయసు వారిలోనూ కీళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి సింపుల్ ఆయుర్వేద చిట్కా ఒకటి బాగా పనిచేస్తుంది. దాన్ని పాటిస్తే… డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
పెరుగు మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. షాపుల్లో పెరుగు ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి. ఈ చిట్కా కోసం ఓ కప్పు పెరుగులో… 2 టీ స్పూన్ల అవిసె గింజలు (Flax seeds) కలపాలి. లేదా వాటిని పొడి చేసి కూడా వెయ్యవచ్చు. పొడి కోసం ముందుగా అవిసె గింజలను చిన్న మంటపై వేడి చెయ్యాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే పొడిగా మారతాయి. ఆ పొడిని 15 రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చు. ఇలా పెరుగు, అవిసె గింజలను మధ్యాహ్నం వేళ తీసుకోవాలి. మూడు రోజులపాటూ ఇలా చేస్తే… కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ల మధ్య వచ్చే గరుకు శబ్దాలు కూడా తగ్గుతాయి. కీళ్లు బాగా పనిచేసేలా కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది.
అవిసె గింజలను ఈ రోజుల్లో స్మూతీలో, సలాడ్‌లో అన్నింటిలోనూ వాడుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజలు… గుండెకు మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. వీటిలోని ఫైబర్… జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. ప్రోటీన్స్, ఫైబర్తోపాటూ… ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉండటంతో… అవిసె గింజల్ని సూపర్ ఫుడ్‌గా, బరువు తగ్గించే ఆహారంగా చెబుతున్నారు. అందువల్ల రోజూ అవిసె గింజల్ని తీసుకుంటే మంచిది.
: మామూలుగా మాంసకృత్తులు (ప్రోటీన్స్) మాంసాహారంలో ఉంటాయి. మొక్కల నుంచీ వచ్చే ప్రోటీన్స్‌లో అవిసె గింజలు చెప్పుకోతగ్గవి. ప్రోటీన్స్ వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినం కాబట్టి… అధిక బరువు సమస్య కొంతవరకూ తీరుతుంది. ఫైబర్ వల్ల కూడా మరో ప్రయోజనం ఉంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం అయిపోనివ్వకుండా… నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందువల్ల కూడా వెంటనే ఆకలి కాదు. అందుకే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు… ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు