యోగీ, షాలను హతమారుస్తాం: ఈమెయిల్‌ బెదిరింపు


కీలక బీజేపీ నేతలను హతమారుస్తాం అంటూ వచ్చిన ఈ మెయిల్‌ బెదిరింపు కలకలం రేపుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను పదవులనుంచి తొలగించండి.. లేదా చంపేస్తాం.. అంటూ ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆఫీస్‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక ఈమెయిల్‌ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఆ ఇద్ద‌రినీ చంపేస్తామంటూ మెయిల్‌ ద్వారా హెచ్చ‌రించారు. 11 మంది సూసైడ్‌ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారి ద్వారా యోగీ, షాలను అంతం చేస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ప్రార్థ‌నా మందిరాలు, ఇత‌ర ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లోనూ దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఈమెయిల్‌ ఎక్కడనుంచి వచ్చింది అనే దానిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

About The Author