వృద్ధ దంపతులు ఆత్మహత్య…


అనారోగ్యం కారణంగా వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరి వారి పల్లి కి చెందిన టి. చిన్నబ్బ నాయుడు(73) టి.రుక్మిని (63) జీవిస్తున్నారు. చిన్నబ్బ నాయుడు గత కొంత కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిమ్స్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం 7వ తేదీన వేదగిరి గారి పల్లి నుంచి తిరుపతి కి చేరుకొని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జీలో రూము అద్దెకి తీసుకుని భార్యాభర్తల లిద్దరు రోజులుగా లాడ్జి లో ఉంటూ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకుని శనివారం సాయంత్రం తిరిగి లాడ్జికి చేరుకున్నారు. అనారోగ్య బాధతో మస్థాపం చెంది, రాత్రి కూల్ డ్రింక్స్ లో క్రిమిసంహారక మందు కలుపుకుని ఆత్మహత్య చేస్తుకున్నారు. ఆదివారం ఉదయం అవుతున్నా వారు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

About The Author