నాన్న కూతురి సంభాషణ..


పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..
అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..
పెళ్ళికూతురు … పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని
తండ్రి దగ్గరకు వచ్చి … కౌగలించుకుని … ప్రేమగా … ఒక ముద్దు పెట్టింది …
ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ … ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి.
ఏమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో …..
పెళ్ళికూతురు … తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి …
కళ్ళు తుడుచుకుంటూ … ” ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం … నాకిక లేదు”
అని చెపుతూ వెనుతిరిగింది
చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..
తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని … మరుక్షణం ఎంతో సంతోషంగా …
తండ్రి : ” “ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు … వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది … ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని … నాకు తిరిగిచ్చేసింది.”
చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు …. అందరూ
తండ్రి : ” ఇంతకీ అదేంటో తెలుసా..! నా #క్రెడిట్_కార్డు ..!!”
అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..
ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప …
Next credit card పెళ్లి కొడుకు ది కాబట్టి …

About The Author