పురిటి నొప్పులతో బిడ్డ.. కామాంధుడిగా మారిన కన్నతండ్రి
ప్రసవం కోసం మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై గర్భిణి తండ్రి అత్యాచారానికి యత్నించాడు. ఈఘటన గంగావతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కనకగిరి తాలూకాలోని బసిరిహళ్ గ్రామానికి చెందిన ఒక మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఈనెల 16న ఆశా కార్యకర్త ఆమెను గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాన్పు కష్టంగా మారడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోవడంతో ఆశా కార్యకర్త ఓ గదిలో నిద్రించింది. ఇదే అదునుగా గర్భిణి తండ్రి బాలప్ప(59) ఆశాకార్యకర్తపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆస్పత్రికి చేరుకొని బాలప్పను అరెస్ట్ చేశారు.