కొడుకు పెళ్లి జరగదని తెలిసి.. తల్లిదండ్రుల ఆత్మహత్య


వియ్యంకులు తిట్టారని మనస్తాపానికి గురై దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం జిల్లా, ఇలంపిళ్‌లై సమీపంలోగల పులియంపట్టికి చెందినతంగమణి (59), రత్నం దంపతులు. వీరికి రాజా అన్నామలై అనే కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజా అన్నామలై ఎంబీఏ చదివి చెన్నై ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఎ.పుదూరు ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో రాజా అన్నామలై ఆ యువతితో తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో గొడవ ఏర్పడింది.దీంతో యువతి తల్లిదండ్రులు గురువారం రాజా అన్నామలై ఇంటికి వచ్చారు. అక్కడ మీ కుమారుడిని మందలించండి అంటూ తంగమణిని, భార్య రత్నంను బెదిరించి వివాహం జరగదని చెప్పి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన తంగమణి, రత్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సేలంలో గురువారం పాయిజన్‌ ఇంజక్షన్‌ వేసుకుని ధర్మపురి జిల్లా, పనికారన్‌కొట్టాయ్‌ ప్రాంతానికి చెందిన మణికంఠన్‌కుమార్తె పవిత్ర (21). ఈమె సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు. ఈమె గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

About The Author