మామిడికాయలు ఎందుకు తినాలి?
వేసవి రాగానే బంగారం రంగులో వుండే మామిడికాయలు వచ్చేస్తాయి. ఈ మామిడిలో కేలరీలు తక్కువగా ఉన్నాయి. పోషకాలు ఎక్కువగా ఉన్నాయి – ముఖ్యంగా విటమిన్ సి వుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ పండులో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది.శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది. మామిడిపండులో శరారంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంది, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది.
మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.