రూ. 100 నోట్ వెనుక భాగనా ఈ కొండలు ఎక్కడివో ఎవరికైనా తెలుసా..?

రూ. 100 నోట్ వెనుక భాగనా ఈ కొండలు ఎక్కడివో ఎవరికైనా తెలుసా..?

మనం రోజు నిత్యం అవసరమయ్యే వస్తువులు గురించి మనకి పూర్తిగా తెలియదు అయిన కూడా వాటిని నిత్యం వాడుతూనే ఉంటాం. మనం వాడె వస్తువులో ఏమేం ఉన్నాయో అది దేనికి సంకేతం అని మనకు తెలియదు కానీ వాడేస్తాం. ఇక డబ్బులు ప్రస్తుత కాలంలో డబ్బు లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం ఏది కావాలన్నా కూడా డబ్బుపైనే ఆధారపడి ఉంది. డబ్బు కి ఉన్న వాల్యూ మనిషికి కూడా లేదు. ఆ డబ్బులేక కొన్ని వందల మంది రోజుకు మరణిస్తున్నారు. అయితే ఆ డబ్బు నోట్ పై ఎన్నో మనకి తెలియని గుర్తులు ఉంటాయి కానీ వాటి గురించి మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అని అనుకోము కానీ డైలీ వాటిని వాడుతం. అయితే అందులో రూ.100 నోటు కూడా ఒక‌టి. ఏంటీ.. అందులో స్పెషాలిటీ ఏముంది ? మనం తెలుసుకోవాల్సిన అంత గొప్ప అందులో ఏం దాగిఉంది అని సందేహం వ్య‌క్తం చేయ‌కండి. ఎందుకంటే దాని ద్వారా కూడా మ‌న‌కు ఓ కొత్త విష‌యం తెలుస్తుంది.
అదేమిటంటే…రూ. 100 వెనుక భాగంలో మనకు ఏవేవో బొమ్మలు కనిపిస్తాయి అందులో ఎక్కువగా పర్వతాలు కొండలు కనిపిస్తాయి. అసలు ఆ కొండలు రూ. 100 వెయ్యడానికి గల కారణం ఏంటి? అసలు అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని రూ. 100 ప్రింట్ ఎందుకు చేశారు అంటే అవి మన దేశంలో ఉన్న కొండలే, అవి ఎక్కడ ఉన్నాయి? అసలు ఆ కొండలను ఏమని పిలుస్తారు ఇవన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ఆ ప‌ర్వ‌తాలను కాంచెన్‌జంగా ప‌ర్వ‌తాలు అని పిలుస్తారు. కొంద‌రు కాంచ‌న్ గంగ ప‌ర్వ‌తాలు అని కూడా అంటారు. అవి హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఒక భాగం. మ‌న దేశంలోని సిక్కిం రాష్ట్రం నుంచి చూసిన‌ప్పుడు అవి అలా క‌నిపిస్తాయి. దీంతో అదే బొమ్మ‌ను రూ.100 నోటు వెనుకాల ప్రింట్ చేశారు. ఇది మరి ఆ బొమ్మల వెనుక ఉన్న కధ..

జై భారతమాత కి జై

 

About The Author