నారావారిపల్లెకు సంక్రాంతి కళ…


నారావారిపల్లెకు సంక్రాంతి కళ..

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్నారు మంత్రి నారా లోకేష్‌, భార్య బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన నారావారిపల్లెకు వెళ్లారు లోకేష్‌…

ప్రతి ఏటా సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా పండుగను అక్కడే జరుపుకుంటున్నారు… ఇందులో భాగంగా ఇవాళ చంద్రబాబు, భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకోనున్నారు…

సంక్రాంతి పండగొచ్చిందంటే నారావారి పల్లెకు ప్రత్యేకత సంతరించుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం కావడం… ప్రతిఏటా సంక్రాంతిని ఇక్కడే జరుపుకుంటుండటంతో నారావారిపల్లె హాట్‌టాపిక్‌గా మారింది… సోమవారం, మంగళవారం చంద్రబాబు కుటుంబం ఇక్కడే ఉండి సంక్రాంతి జరుపుకోనుంది… భోగి మంటల కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలు నింపాలని, సంస్కృతి సంప్రదాయాలను మరువక అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.

About The Author