పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరకనే అనలేదు…
రాత్రి మిగిలిన అన్నం దాచుకుని పొద్దున్న తినేదే చద్దన్నం. ఒక ప్పుడు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రివేళ మిగి లిన ఆహారాన్ని అప్పటికప్పుడే పడేస్తున్నారు లేదా ఎవరికైనా ఇచ్చేస్తు న్నారు. ఇప్పుడంటే ఉపాహార సంస్కృతి పెరిగిందిగానీ ఒకప్పుడు చద్ద న్నమే పరమాన్నం కన్నా ఎక్కువ. పైగా పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటా యట. అందుకే కాబోలు పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత పుట్టింది.
చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఓ సర్వేలో తేలింది. పాతతరం వారు ఎంతో ఇష్టంగా చద్దన్నం తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ, పెరుగు కలుపుకుని పచ్చిమిరప, ఉల్లిగడ్డ నంజుకుని తినేవారు. దీంతో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా, శక్తిమంతంగా ఉండేవారు. అలా వారు అప్పటికీ ఇప్పటికీ అదే శక్తితో ముందుకు సాగుతున్నారు. కానీ మనమే దాన్ని పట్టించుకోలేదు
1.సాధారణ భోజనం కంటే పైన చెప్పినవిధంగా తయారైన చద్దన్నంలోనే ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువ ఉంటా యని తేలింది. అందుకే అప్పట్లో మన పెద్దలకు అంతశక్తి ఉండేది. ఇప్పటికీ వారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా రంటే అదే కారణం.
2.అన్నం పులవడం అంటే దానిని ఒకరాత్రి నిల్వ ఉంచడం. దీనివల్ల ఆహారంలో పోషకాలు పెరుగుతాయట.
3.కొంతమంది శరీరం ఎప్పుడు చూసినా వేడిగా జ్వరం వచ్చినట్లు ఉంటుంది. అలాంటివారు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరప కాయలతో చద్దన్నం కలిపి తింటే వేడి తత్వం తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. అధిక వేడితో కడుపులో ఉండే దుష్పలితాలు తగ్గుతాయి.
4.చద్దన్నం తినడంవల్ల దేహం పూర్తిగా అలసిపోదు. శరీరానికి కావ ల్సిన శక్తి లభిస్తుంది. దీనివల్ల రోజులో ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండడానికి వీలవుతుంది.
5.చద్దన్నం వల్ల మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టిక ఆహారం. బక్కచిక్కిపోతున్న వారు తోడువేసిన చద్ది అన్నాన్ని, స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
6.శరీరాన్ని ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంచడానికి చద్దన్నం ఉపయోగ పడుతుంది. అదేవిధంగా చద్దన్నం తినడం ద్వారా శరీరానికి మేలు చేసే బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది.
7.చద్దన్నం తినడంవల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుదల మాత్రమే కాకుండా కొన్ని చర్మ సంబంధమైన వ్యాధులనుంచి కూడా అది శరీరాన్ని రక్షిస్తుంది.
8.చద్దన్నంలో ఉండే కొన్ని విలువైన పోషకాలు కడుపులో ఉండే అనా రోగ్య సమస్యలను తగ్గిస్తాయి. పేగుల్లో వచ్చే అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్‌ను అదుపులో ఉంచి హైపర్ టెన్షనను గణనీయంగా తగ్గిస్తుంది.
9.అయితే చద్దన్నం తినాలి అన్నాం కదా అని, చద్దన్నాన్ని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడంవల్ల కొత్త సమస్యలు వస్తాయి, చద్ది అన్నాన్ని ఉదయాన్నే తినేయాలి