ప్రజా సేవలో ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి


ప్రజా సేవలో ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన కుమార్తె గౌరవనీయులు బియ్యపు పవిత్ర రెడ్డి లను ఆదర్శంగా తీసుకుని రేణిగుంట డి.ఎస్.పి శ్రీ రామచంద్ర ఆధ్వర్యంలో రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ నాగేశం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి మాస్కులు, శానీటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశం మాట్లాడుతూ కరోనా రెండవ తరంగం చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను మహమ్మారి బారిన పడకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరవనీయులుశ్రీ మధుసూదన్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇప్పటికే టీకాల ప్రక్రియ వేగవంతమయిందన్నరు. ప్రజలు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించి, కరోనా భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ సునీల్, వార్డు మెంబర్లు కృష్ణమూర్తి, ఖాదర్ ఖాన్ వైకాపా నేతలు చైతన్య ,రాజేంద్ర, చందు, ఆర్ డి రాజేష్ కుమార్,ఇన్చార్జి కార్యదర్శి రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ శివశంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు

About The Author