కృష్ణగాడివీరప్రేమ గాథ (2016)

https://www.facebook.com/474123499353156/posts/1942006205898204/

నువ్వంటే నువ్వంట నా నవ్వు❤❤
నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటూ లేమనీ?❤
అవునంటూ మాటివ్వు
నిజమంటూనే నువ్వు ??
నే రాని దూరాలె నువ్ పోనని?❤️

ఎటు ఉన్నా నీ నడక
వస్తాగా నీ వెనక❤❤
దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు
ఎక్కడికో నువ్ అడుగు
నిలుచున్నా నీవైపే చేరేనులే❤?

నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామ ఈ వానలో❤❤

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.❤❤

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.❤❤

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే❤?

నువ్వూ నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేనా కలిసే వున్నా
మనమంటూ పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే?❤

ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా
❤❤
నువ్ నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే❤❤

నచ్చే దారుల్లోనడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రములోన
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే?❤

వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా❤❤

చిత్రం : కృష్ణగాడివీరప్రేమ గాథ (2016)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్
గాన : హరిచరణ్, సింధూరి విశాల్

About The Author