ఒకే కుటుంబంలో 7గురి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
బిలాస్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ విషాదఘటన సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగింది. పోలీసుల ప్రకారం, బాధితులందరు కూడా హోమియోపతి మందులను వాడిన తర్వాత చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరు ద్రోసేరా30 అనే మందు వాడినట్టు తెలిసింది. బాధితుల్లోనలుగురు మంగళ వారం అర్థరాత్రి మరణించారు. మరో ముగ్గురు బుధవారం మరణించారు.చనిపోయిన వారిలో కమరలేష్ ధూరి(32), అక్షి ధురి(21), రాజేష్ ధూరి (21), సమ్రూ ధూరి (25), ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాష్ ధూరి (50), దీపక్ ధూరి (30) ఉన్నారు. కాగా, వీరికి కరోనా సొకిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు వీరి అంత్యక్రియలు పూర్తిచేశారు. వీరి మరణాలతో అప్రమత్తమైన పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి సంఘటనపై ఆరాతీస్తున్నారు. మరికొందరిని బిలాస్‌పూర్‌లోని సిమ్స్‌కు (ఛత్తీస్‌ఘడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్ బిలాస్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వీరందరు హోమియోపతి ప్రాక్టిస్‌చేసే వ్యక్తి నుంచి ఈ సిరప్ తీసుకున్నట్లు దర్యాప్తులో తెలింది. అయితే సంఘటన తర్వాత వైద్యుడు గ్రామం నుంచి పారిపోయాడు. కేసును నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.