కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి
కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందాడు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు ఏప్రిల్ 26వ తేదీన వైరస్ సోకిన విషయం విదితమే.
అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు ఏప్రిల్ 27న తరలించారు.
కొవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.
ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 క్రిమినల్ కేసులను రాజన్ ఎదుర్కొంటున్నాడు 2015లో రాజన్ అరెస్టు అయ్యారు.
2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో రాజన్ దోషిగా తేలాడు.
దీంతో అతనికి జీవిత ఖైదు విధించారు. రాజన్ పై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు.
ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.