పుట్టా మధు ఎక్కడ? వారం రోజులుగా వీడని సస్పెన్స్‌…


పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్‌పై సస్పెన్స్.
ఆయన ఎక్కడికి వెళ్లలేదంటున్న పోలీసులు.
మహారాష్ట్రలో ఉన్నట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన కనిపించకుండాపోయారు. ఓ వైపు ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండగా… మధు ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెబుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నలుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా.. ఆయన ఎక్కడికి వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని చెబుతున్నారు.
అయితే వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన వెళ్లారంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలు గుసగుసలాడు కుంటున్నారు. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లనట్లు తెలుస్తోంది. అంతకుముందే తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలేసి తన భార్య కారులో వెళ్లినట్లు సమాచారం.
అయితే పుట్టా మధు హైదరాబాద్‌కు కాకుండా మహారాష్ట్రకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ చివరగా మహారాష్ట్రలోని సెల్‌ టవర్‌ క్యాచ్‌ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని వని పట్టణంలో పుట్ట మధు సోదరుడు, మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు మహారాష్ట్రకు చెందిన ఓ వార్తాపత్రిక కథనం ప్రచురించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్‌లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ వచ్చారనే ప్రచారం ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో టచ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన పుట్ట మధు టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని

About The Author