కరోనా పేషంట్లతో.. నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే చెవిరెడ్డి


* అధైర్య పడొద్దంటూ భరోసా
* ఆక్సిజన్ బెడ్ల పై ఉన్న బాధితుల పరామర్శ
* కార్మిక సిబ్బంది తో కలిసి పనిచేసి.. ఆత్మస్థైర్యం నింపిన వైనం
* శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి,

కరోనా వచ్చిందంటనే.. అల్లంత దూరం వెళ్లే ఈ రోజుల్లో.. వందల సంఖ్యలో కరోనా పేషంట్లు ఉన్న తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించి ఔరా అనిపించారు.

శనివారం తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయం.. కోవిడ్ ఆసుపత్రిని ఎమ్మెల్యే చెవిరెడ్డి సందర్శించారు. కరోనా పేషంట్ల తో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. అనంతరం ఆక్సిజన్ బెడ్ల పై అత్యవసర సేవలు పొందుతున్న కరోనా పేషంట్ల ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ధైర్యంతోనే కరోనాను జయించవచ్చని భరోసా కల్పించారు. కార్మికులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి కరోనా బాధితులకు అల్పాహారాన్ని అందజేశారు. ఆత్మీయంగా పలకరించి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడారు. వారి సేవలను అభినందించారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కరోనా బాధితులు చేస్తున్న యోగాను పరిశీలించారు.

*మీడియా తో మాట్లాడుతూ..*

♦️కరోనా పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ ఆసుపత్రిలో 1100 మంది పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధురాలు.. ఇక్కడ తనకు అందిన సేవల కు మెచ్చి తన ఒక నెల పింఛన్ ను నగదును అందించడం.. అధికారులు, సిబ్బంది తనతో కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ అందిస్తున్న సేవలకు ఆమె స్పందించిన తీరు నిదర్శనమన్నారు. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించడం మా బాధ్యత గా భావిస్తున్నామని.. వారికి భరోసా కల్పిస్తున్నామన్నారు. అత్యంత తీవ్రతరంగా ఉన్న కరోనా సెకండ్ వేవ్ లో సమర్థవంతంగా సేవలు అందిస్తున్న శానిటరీ వర్కర్లు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇంట్లో కూర్చుని మాటలు చెప్పే ప్రజాప్రతినిధులం కామని, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ ఆసుపత్రి నోడల్ అధికారిని, తుడా సెక్రటరీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

About The Author