కడపలో జిలేట్ బ్లాస్ట్….


కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్ పేలి పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తరలించి,అన్‌లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కారణాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులను ఆదుకోవాలని, ఎల్.జీ పాలిమర్స్ బాధితులకు ఎలాంటి పరిహారం ఇచ్చారో వీరికీ అలాంటి పరిహారమే అందించాలని డిమాండ్ చేశారు. కరోనా పరిస్థితుల్లో, కర్ఫ్యూ సమయంలో మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు.

About The Author