తెలంగాణ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా పకడ్బందీ చర్యలు


గత ఏడాది కోవిడ్ తొలిసారి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయని గుర్తించింది. ప్రభుత్వం ముందు చూపు వల్ల ఇప్పుడు తెలంగాణలోని అనేక ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి.

కోవిడ్ రెండో వేవ్‌లో ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ పెరగడంతో అనేక రాష్ట్రాల్లో కల్లోలం రేగింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇప్పటికి ఆక్సిజన్ అందక 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇటువంటి స్థితిని నివారించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతాధికారి ఆక్సిజన్ సరఫరా, వినియోగం నిరంతరం మానిటర్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు కూడా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణలో ఉన్న 23 ఆక్సిజన్ రిఫిల్లర్ల వద్ద, 63 ఆక్సిజన్ డీలర్ల వద్దా ఒక్కో ప్రభుత్వ టీం పెట్టి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూస్తున్నది. అన్ని ప్రైవేటు దవాఖానాలకు కూడా తమ తమ రోజువారీ ఆక్సిజన్ అవసరాలను జిల్లా కలెక్టర్‌కు ఎప్పటికప్పుడు తెలపాలని ఆదేశాలు ఇచ్చింది.

ఆక్సిజన్ తెప్పించడానికి వైమానిక దళ సమన్వయంతో విమానాలు, రైల్వే శాఖ తోడ్పాటుతో గూడ్స్ రైళ్లు, రోడ్డు మార్గాన కూడా ఇతర రాష్ట్రాల నుండి ఆక్సిజన్ టాంకర్లు తెప్పిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ విపత్కర సమయంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా ఉన్నది.

#TelanganaFightsCorona

About The Author