లొక్డౌన్ విధిస్తారా.. లేదంటే: టీఎస్‌ హైకోర్టు


రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. అదే విధంగా.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించింది. ఇక పాతబస్తీలో కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం.. లాక్‌డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. కాగా తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో… లాక్‌డౌన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు మంత్రివర్గ సమావేశం అనంతరం సాయంత్రానికల్లా ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

About The Author