జీవితంలో ఒడిపోతున్న పురోహితుడు


ఒకప్పుడు పురోహితం చెయ్యడం అంటే గౌరవం ఆ గౌరవం తోనే చాలామంది బ్రాహ్మణులు గురువులు దగ్గర లేదా వేదపాఠశాలలో చేరి వేద విద్య, స్మార్తం నేర్చుకొని ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి వారి సర్వ శుభకార్యక్రమములు నిర్వహిస్తూ తన ఇంటిని అనగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం సగటు పురోహితుడు పరిస్థితి చాలా దారుణంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా మూడాలు రావడం, ఒకపక్క కరోన లాంటి వైరస్ విళయ తాండవం చేస్తుండడంతో కార్యక్రమాలు లేక, సరైన సంపాదన లేక, సమాజంలో గౌరవంగా బ్రతికి ఇప్పుడు బయటకువెళ్లి ఎలాంటి కూలి పనులు చేసుకోలేక, భిక్షాటన కూడా చేసుకోలేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. పోనీ బ్రాహ్మణ సంఘాలు అలాంటి వారిని ఆదుకుంటారా అంటే అదీ కూడా జరగడం లేదు.
ఇక తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో అయితే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో మొద్దుగా నిద్రపోతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే చాలామంది పేద, మధ్యతరగతి పురోహత బ్రాహ్మణులకు ఆకలి చావులు తప్పవు. అదే జరిగితే దేశానికి చాలా అరిష్టం దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వైద్యం, నిత్యవసర సరుకులు, వంటి సదుపాయాలు వంటివి సమకూర్చేలా ప్రతీ ఒక్కరు ఆలోచించండి. ప్రస్తుత రోజుల్లో అద్దె ఇళ్లల్లో ఉన్న పేద, మధ్యతరగతి పురోహితులకి ఇంటి ఓనర్స్ నుండి కూడా చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి అలాంటి వారిని కూడా ఆదుకునేలా ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని ప్రజలందరినీ కోరుతున్నాను….
మీ శివ ప్రసాద్ శర్మ
ఓ మధ్యతరగతి పురోహితుడు
కాంటాక్ట్ నంబర్ 9703094250
హైదరాబాద్

About The Author