మైక్రోసాఫ్ట్‌లో హైదరాబాద్‌ విద్యార్థినికి జాబ్‌, రూ.2 కోట్ల వార్షిక వేతనం..


హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భాగంగా రూ.2 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. దీప్తి తండ్రి, ఫోరెన్సిక్‌ నిపుణుడు డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని క్లూస్‌ టీమ్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. దీప్తి యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్లోరెడాలో సీటు సాధించారు. ఇలా అమెరికా వెళ్లిన ఆమె ఎంఎస్‌ (కంప్యూటర్స్‌) ఈ నెల 2తో పూర్తి చేశారు.

దీనికి ముందే ఆ యూనివర్శిటీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీప్తికి మైక్రోసాఫ్ట్, గోల్డ్‌ మెన్‌ సాక్స్, అమేజాన్‌ కంపెనీల్లో ఉద్యోగం వచి్చంది. ఈమె మాత్రం మైక్రోసాఫ్ట్‌ సంస్థ వైపే మొగ్గు చూపారు. దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌డీఈ) గ్రేడ్‌–2 కేటగిరీలో ఎంపిక చేసుకుంటూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజ్‌ ఇచ్చారు. ఈ నెల 17న మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో దీప్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.

About The Author