నెల్లూరు హాస్పిటల్స్ అన్ని క్లీన్ ఔట్…


నెల్లూరు GGH ఆస్పత్రిలో కరోనా రోగులు ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో కరోనా పేషెంట్స్ బెడ్లు హాస్పిటల్ లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి మళ్లీ నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ఇక్కడ 5 వేల మందికి మందు తయారు చేశారు. అయితే, ఇక్కడ ఉన్న జనం 35 వేల మంది సుమారు ఉన్నారు. వీరిలో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఏకంగా రెండు వేల వరకూ అంబులెన్స్ లు బారులు తీరి వరుసగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులకు గురి అవుడం మంచిదికాదని… తొందరపడి రావొద్దని… రెండు రోజుల్లో రద్దీ తగ్గుతుందని.. దీనిని అందరూ గమనించాలని స్థానికులు అంటున్నారు. ఇదిలాఉండగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. “కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న ఆయుర్వేద మందును, (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.” అని కాకాణి పేర్కొన్నారు.

About The Author