104 కాల్ సెంటర్ కు వొచ్చే కాల్స్ త్వరితగతిన పరిష్కరించాలి..


ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ..
కలెక్టర్ ఇంతియాజ్

కోవిడ్ భాదితులకు వైద్య సేవలు, సూచనలు అందించడంలో 104 కాల్ సెంటర్ పాత్రే కీలకం అని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.

స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ని 104 కాల్ సెంటర్ ను ఆదివారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ స్ట్రెయిన్ , బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు విషయంలో మరింత అప్రమత్తంగా విధుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. 104 కాల్ సెంటర్ కు ప్రజలు కాల్ చెయ్యడంలో వారికి పరిష్కారం లభిస్తుంది అన్న విషయం తెలిసిందే నని ఆయన అన్నారు. కోవిడ్ కేసుల్లో గతంలో కంటే ఎక్కువ కేసులు మే నెలలో నమోదు అయ్యాయన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని హాస్పిటల్, సిసిసి, హోమ్ ఐసోలేషన్ ద్వారా మెరుగుపరచడానికి గల అవకాశాలు మేర తగిన సూచనలు చేయాలన్నారు.

సుమారు 75 మంది 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారని ప్రతి రోజు 500 నుంచి 550 కాల్స్ వరకు వొస్తున్నాయని అసిస్టెంట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక వివరించారు. ఆరోగ్య సేవలు హోమ్ ఐసోలేషన్ లో ఉండి పొందుతున్న వారిలో కొందరితో మాట్లాడి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఆరోగ్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న వారితో డాక్టర్లు తో మాట్లాడిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి కాల్ కి టికెట్ రైజ్ చేసి, పరిష్కరించడానికి చర్యల్లో భాగంగా సిబ్బంది ఏద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

కలెక్టర్ తనిఖీ ల్లో సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, డ్యూటీ డాక్టర్లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

About The Author