కర్నాటక మద్యంపై పోలీసుల ఉక్కుపాదం …


కర్నాటక మద్యంపై పోలీసుల ఉక్కుపాదం …
రూ. 4 లక్షల కర్ణాటక మద్యం పట్టివేత
ఏడుగురు నిందితులు అరెస్టు… స్కార్పియో, బొలేరో పికప్ మరియు 7 సెల్ ఫోన్లు, రూ. 92,080/- నగదు స్వాధీనం
కర్నాటక మద్యంపై అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కర్నాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్న ఏడుగుర్ని అరెస్టు చేశారు. స్కార్పియో, బొలేరో పికప్ వాహనాలతో పాటు 7 సెల్ ఫోన్లు, రూ. 92,080/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
** నిందితుల వివరాలు :
1) K నరేంద్ర బాబు, 30 సం, కళ్యాణదుర్గం.
2) B లింగమయ్య, @ మూర్తి, 29 సం., మాముడూరు గ్రామం, బ్రహ్మసముద్రం
3) B.మారెన్న, వయస్సు: 32 సం., గొంచిరెడ్డిపల్లి గ్రామం, బ్రహ్మసముద్రము మండలం
4) గూనిపల్లి ఉమేష్, 32 సం.లు, బోరంపల్లి గ్రామం, కళ్యాణదుర్గం మండలం
5) B.మదన్ మోహన్, 31 సం.,అంకంపల్లి గ్రామం, బెళుగుప్ప మండలం
6) M. తిమ్మరాజు, 25 సం., నాగిరెడ్డి పల్లి గ్రామం, రాయదుర్గం మండలం
7) జువైనల్ ( ఈ మైనర్ ను జువైనల్ కోర్టు ముందు హాజరు పరిచారు.
** స్వాధీనం చేసుకున్నవి:
* 95 బాక్సుల టెట్రా పాకెట్లు ( 9,120 టెట్రా పాకెట్లు… వీటి విలువ రూ. 4 లక్షలు)
* స్కార్పియో, బొలేరో పికప్ వాహనాలు
* రూ. 92,080/- నగదు, 7 సెల్ ఫోన్లు
** నేపథ్యం:
ప్రస్తుతం అరెస్టయిన వీరిలో K నరేంద్రబాబు, B లింగమయ్య, B మదన్ మోహన్ లు ముఖ్యులు. మిగితా వారిని కలుపుకుని ముఠాగా ఏర్పాటు చేసుకున్నారు. కర్నాటక సరిహద్దుల్లోని చెళ్లికెర, బసాపురం ప్రాంతాలలో టెట్రా పాకెట్లను కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించి తరలిస్తూ పట్టుబడ్డారు.
** అరెస్టు ఇలా:
కర్నాటక మద్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు ఆదేశాలు జారీ చేశారు. సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు సూచనల మేరకు అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సైలు శాంతిలాల్ , జమాల్ బాషా, ఏఎస్సై షేక్సావలి, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, శంకర్ , ధనుంజయలు కానిస్టేబుళ్లు నాగరాజు, అనిల్ కుమార్, వెంకట రమణ, రాజన్న, విజయ్ , రామయ్య, భాస్కర్ నాయుడు, హరినాథ్ రెడ్డి, నాగభూషణం, సంజీవ్ రాయుడులు బృందంగా ఏర్పడి వీరిని ఈరోజు స్థానిక కళ్యాణదుర్గం రోడ్ లో అరెస్టు చేశారు.

Cr.No.244/2021 U/s 34(a) r/w 34(1)(i) of A.P Excise Amendment Act 2020 and Sec.8(b)(i) of A.P. Prohibition Amendment Act-2020 of Ananthapuramu 4th town PS.

About The Author