భారత ప్రభుత్వం భారత వాతావరణ శాఖ,వాతావరణ కేంద్రం,అమరావతి.

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమరిన్ ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతము & తూర్పు మధ్య బంగాళాఖాతంలలోని మరికొన్ని ప్రాంతాలు; పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతం లోని అన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది.

అతి తీవ్ర తుఫాను ‘యాస్’ (‘యస్’ అని ఉచ్ఛరిస్తారు) ఈ రోజు (26.05.2021) ఉదయం 10:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో latitude 21.3°N మరియు longitude 86.95°E వద్ద, బాలాసోర్ (ఒడిశా) కి దక్షిణంగా 25 km దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతము బాలాసోర్ దక్షిణ తీర ప్రాంతంలో తీరాన్ని దాటుతున్నది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి 2 గంటల సమయం పడుతుంది. ఇది తీరం దాటే సమయంలో గాలులు 130 -140 kmph వేగముతో, అత్యధికంగా 155 kmph వేగముతో వీచే అవకాశం ఉంది.

———————————
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన* :

*ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం* :
——————————
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఈదురు గాలులు (30 – 40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

*దక్షిణ కోస్తా ఆంధ్ర* :
——————————
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఈదురు గాలులు (30 – 40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

*రాయలసీమ*:
———————-
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

— సంచాలకులు,
*అమరావతి వాతావరణ కేంద్రము* .

About The Author