గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో పాట…

https://www.facebook.com/474123499353156/posts/1943874702378021/

కలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
చలిమంట వెలుగుల్లూ తుమ్మెద ఓ తుమ్మెద
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ… ఆ… పేరంటం
ఊరంతా… ఆ… ఆ… ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు…

గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో

మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ నమ్మే మన పల్లెటూళ్లు
న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్లనే మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది
మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా

పాటే పంచామృతం మనసే బృందావనం
తడితేనే ఒళ్లు ఝల్లు
మాటే మకరందము చూపే సిరి గంధము
చిరునవ్వే స్వాతి జల్లు
జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్లనీ మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే…

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
హోయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెదా
హోయ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ… ఆ… పేరంటం
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఊరంతా… ఆ… ఆ… ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు…

చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర, బృందం

About The Author