యాదాద్రిలో వైభవంగా గోదా కల్యాణం…
వైభవంగా గోదా కల్యాణం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యకేత్రంలో గోదాదేవి, పాండురంగనాథుల కల్యాణం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. 30రోజుల పాటు ధనుర్మాస పూజలు చేపట్టిన విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవికి రంగనాథుడు ప్రసన్నమై వివాహమాడే పర్వాలను ఆచార్యులు నిర్వహించారు. గోదాదేవి తన మనోనాథుడైన శ్రీ రంగనాథుడిని ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం వేకువజాముల వ్రతం చేపట్టి ధనుర్మాస పూజలు నిర్వహించారు. వైష్ణవి ఆచారపరంగా అమ్మవారిని ఆలయ మహామండపంలో గోదాదేవిగా ఆలంకరించి పెండ్లికూతురిగా ముస్తాబుచేశారు. నరసింహ ఉత్సవమూర్తిని శ్రీ రంగనాథుడిఆ తీర్చిదిద్ది కల్యాణోత్సవం చేపట్టారు. తొలుత రథశాల ఎదుట గాంధర్వ కల్యాణం, ఆలయంలో శాస్ర్తోక్తంగా కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధానాచార్యులు నల్లంధీగళ్ నరసింహాచార్యులు సమక్షంలో పూజారులు వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకల్లో కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు.