టీఆర్‍ఎస్‍కు ఈటల గుడ్‍బై


టీఆర్‍ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

*ఈటల రాజేందర్ కామెంట్స్…*

ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి కూడా ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు.

కానీ ఈ రాష్ట్రంలో ఈ రాజుగారి పాలనలో ఆ పరిస్థితి లేదు

నాపై రాత్రికి రాత్రే విచారణ పూర్తి చేసి బర్తరఫ్ చేశారు.

కనీసం నా వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు

మంత్రిపై అనామకుడు ఉత్తరం రాస్తే ఏం జరిగిందో తెలుసుకోలేదు

హుజూరాబాద్ లో ప్రజా ప్రతినిధులను అనేక రకాలుగా ఆందోళనకు గురిచేశారు

ప్రాణం ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించారు

హుజూరాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం

19 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ లోనే ఉన్నా

కొంతమంది నేతలు నాపై అవాకులు , చెవాకులు పేలుతున్నారు

బంగారుపళ్లెంలో పెట్టి హుజూరాబాద్ ను అప్పగించామని అంటున్నారు

నాకు పదవులు ఇవ్వలేదని ఏనాడూ నేను చెప్పలేదు

ఐదేళ్ల క్రితమే టీఆర్‌ఎస్ తో గ్యాప్ వచ్చింది

నాకే కాదు… హరీష్ రావుకు కూడా ఆ గ్యాప్ వచ్చింది

హరీష్‌రావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు

హరీష్ రావుకు కూడా అవమానం జరిగింది

డబ్బులు, కుట్రలతో అధికార పార్టీ ఉపఎన్నికల్లో గెలవచ్చు .

నాడు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నారు కానీ కేసీఆర్ మాత్రం డబ్బు, కుట్ర, అణచివేతను నమ్ముకున్నారు

ఈ కుట్రలన్నింటిన ఛేదిస్తామనే నమ్మకం మాకు ఉంది

బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు?

అది ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం

సీఎంవో ఆఫీసులో ఒక్క దళిత ఐఏఎస్ అయినా ఉన్నాడా?

ఆర్థికశాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు

మంత్రిని ఎవరైనా కలిస్తే ఎందుకు కలిశారని అడిగే పరిస్థితి

కేసీఆర్ ను కలిసేందుకు రెండు సార్లు ప్రయత్నించా.. కానీ అవకాశం ఇవ్వలేదు

అనేక సంఘాలు పెట్టించాం

తెలంగాణ గడ్డమీద సంఘాలు, సమ్మెలు ఉండొద్దనేది కేసీఆర్ ఉద్దేశం

బొగ్గు కార్మికులతో ఎలాంటి సంబంధం లేనివారు సంఘం నాయకులుగా ఉన్నారు

ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన సంఘాలన్నీ ఇవాళ కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయి

ఉద్యమ సమయంలో ఆర్టీసీ చైతన్యం అవసరమైంది .

కానీ ఇప్పుడా ఆర్టీసీనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు

తెలంగాణలో సంఘాలే లేకుండా చేస్తున్నారు

ధర్నా చౌక్ ను ఎత్తివేసిన చరిత్ర వీరిది

సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదు

టాక్స్ పే చేసేవాళ్లకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా .

ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెబితే తప్పా?

పార్టీలో క్రమశిక్షణ కలిన సైనికుడి మాదిరిగానే ఉన్నాను

కుక్కిన పేను లాగా ఉండటం లేదని నాపై కోపం వచ్చింది

రోషం కలిగిన బిడ్డను కాబట్టే కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్టుకున్నా

నీచపు వార్తలతో నాకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం చేశారు

ఒక్క మంత్రి కూడా స్వచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు

మంత్రులేకాదు, అధికారులకు కూడా స్వేచ్ఛ లేదు

సంక్షేమ పథకాల ముసుగులో ఇవన్నీ మరుగున పడతాయనుకుంటే పొరపాటు

లాలూ, జయలలిత, మాయావతి లాంటి పార్టీ కాదు ఇది

మీకు ఎవరూ దిక్కులేని నాడు.. మీ పక్షాన ఉన్నవాళ్లు బయటికి వెళ్లిపోతున్నారు

లక్షలమంది ఉద్యమం, బలిదానాలతో రాష్ట్రం వచ్చింది

17 మంది మంత్రులపైనే మీకు నమ్మకం లేకపోతే 4 కోట్లు మంది ప్రజల్ని పాలించే హక్కు మీకెక్కడిది?

About The Author