భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా?


ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనం చేసిన తర్వాత ఇలా చేయకూడదు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కొన్నింటిని తినకుండా వుంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం సమస్యలను నియంత్రించుకోవచ్చు.భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇలా తింటే పొట్ట బాగా పెరుగుతుంది.
అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో వుండే ఆమ్లాలు ఆహారంలో వుండే మాంసకృత్తును శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
భోజనం అయ్యాక పది నిమిషాలు పాటు నడిస్తే మంచిదంటారు. కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, పది నిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

About The Author