వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌!


కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతి రాష్ట్రం వ్యాక్సిన్ వేసుకోవాలి అవగాహన కలిపిస్తున్నాయి. అలాగే, వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి పలు స్వచ్చంద సంస్థలు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బ్యాంకులు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రజలను ప్రోత్సాహిస్తున్నాయి. పరిమిత కాలానికి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కనీసం ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వినియోగదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 999 రోజుల పాటు 30 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అధిక రేటును అందించనున్నట్లు యుకో బ్యాంక్ తెలిపింది.

“టీకా డ్రైవ్‌లను ప్రోత్సహించడానికి మా వంతు సహాయం చేస్తున్నాము. మేము UCOVAXI-999 పేరిట ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చాము. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది” అని ఒక బ్యాంకు అధికారిని చెప్పారు. అలాగే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవలే ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ అనే ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ కింద టీకాలు వేసుకుంటే వినియోగదారులకు 25 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకం 1,111 రోజుల మెచ్యూరిటీని కలిగి ఉంది. ఇది పరిమిత కాలానికి వర్తిస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న సీనియర్‌ సిటిజన్లకైతే అదనంగా మరో 25 బేసిస్‌ పాయింట్లు కలిపి మొత్తం 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.50శాతం వడ్డీ ఇవ్వనుంది.

About The Author