కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ జె నివాస్ ప్రస్థానం..
కృష్ణాజిల్లా కలెక్టర్ గా జె నివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పటి వరకు కలెక్టర్ గా వ్యవహరించిన A.Md ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అవ్వగా ఆయన స్థానంలో శ్రీకాకుళం కలెక్టర్ గా వ్యవహరిస్తున్న జె నివాస్ నియమితులైన సంగతి తెలిసిందే.
కలెక్టర్ గా జె నివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన గురించి కొన్ని విషయాలు పబ్లిక్ వైబ్ వీక్షకుల కోసం..
జె. నివాస్ 2010 బ్యాచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన IAS అధికారి.
2003వ సంవత్సరంలో VIT (నెల్లూరు ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెల్లూరు) నుండి మెకానికల్ ఇంజినీరుగా పట్టభద్రుడయ్యారు.
కొంత కాలం నాటెక్ వాబాగ్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజినీరుగా పని చేసిన తర్వాత IAS అధికారి కావాలనే తన కలని సాకారం చేసుకోవడానికి 2006వ సంవత్సరంలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.
2009వ సంవత్సరంలో తన మూడవ ప్రయత్నంలో IAS ను సాధించారు.
UPSC పరీక్షలో 45వ ర్యాంకు పొందారు.
ముస్సోరిలో IAS ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని తరువాత మరో ఏడాది జిల్లా శిక్షణ అప్పటి తూర్పుగోదావరి కలెక్టర్ ముద్దడ రవిచంద్ర వద్ద మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు.
నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ గా మొదట పోస్టింగ్ చేపట్టారు.
సబ్ కలెక్టర్ గా పని చేసిన కాలంలో గిరిజన లోతట్టు మత్స్యకారుల ప్రయోజనం కోసం ప్రత్యేకమైన గిరిజన మత్స్యకారుల సంఘాల ఏర్పాటుకు ఆయన కృషి అభినందనీయమనే చెప్పాలి.
అలాగే వేలాది గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే 33 సంఘాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని బాలకార్మికుల దుస్థితిని గమనించిన నివాస్ బాలకార్మికుల ఉపశమనం, పునరావాసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.
వెదురుపాలెం గ్రామస్థులు భూస్వాముల చేతుల్లో నలిగిపోతున్న తీరును ఆయన గమనించి దాని నుండి ఆ ప్రజలకు విముక్తి కల్పించారు.
భూస్వాములు ఆక్రమించిన పేదల భూములపై భూమి హక్కులను కల్పించారు.
గూడూరు ఇటుక బట్టీలలో పని చేసే 170 మంది ఒరిస్సా బాల కార్మికులను బయటకు తీసుకువచ్చారు.
పేద గిరిజనులకు RSR హక్కులను కల్పించేందుకు విశేష కృషి చేశారు.
అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ITDA POగా బదిలీ అయ్యారు.
గిరిజన ప్రాంతంలో AVVAL ప్రాజెక్ట్ ను 24/7 కాల్ సెంటర్, గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా సంస్థాగత డెలివరీని మెరుగుపరచడానికి తన వంతు కృషి చేశారు.
ఈ ప్రాజెక్ట్ క్రింద ఆసుపత్రుల్లో 10 వేల కన్నా ఎక్కువ సజీవ జననాలను నిర్ధారించడంతో దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పధకంగా స్వీకరించింది.
IIT ప్రవేశ పరీక్షల కోసం గిరిజన పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించే ప్రయత్నంలో వారు బ్రైట్ స్టార్ పథకాన్ని ప్రారంభించారు.
దీనిని కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.
ఈప్రాజెక్ట్ ను పరిపాలనలో మంచి చొరవగా పరిగణించి తెలంగాణా ముఖ్యమంత్రి అవార్డు ప్రదానం చేశారు.
ఇటువంటి అంశాలు జె.నివాస్ ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి.
ఆ తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా సేవలందించారు.
అక్కడ భూపరిపాలనలో అద్భుతమైన పని తీరు ప్రదర్శించి విలువైన ప్రభుత్వ భూములను రక్షించారు.
ఆక్రమణల క్రమబద్ధీకరణకు GIS ఆధారిత వ్యవస్థను ప్రవేశ పెట్టారు.
ఇది 75 వేల మందికి పైగా పేద కుటుంబాలకు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి ఇంటి చెల్లింపు పన్ను చెల్లింపుకు సహాయపడింది.
ఒకే రోజు 30 వేలకు పైగా ఇళ్ల పట్టాలు విశాఖపట్నంలో మహిళల పేరు మీద ఇవ్వడం ఒక రికార్డుగా చెప్పవచ్చు.
చమురు కంపెనీలతో సమన్వయం చేసుకుని అప్పటి విశాఖపట్నం, అనకాపల్లిలో చమురు కంపెనీల సహకారంతో ప్రభుత్వరంగ చమురు కంపెనీలచే CSR పధకం క్రింద పేదలకు 75 వేల ఉచిత LPG గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయించారు.
ఈ పధకం కిరోసిన్ లేని ఆంధ్రప్రదేశ్ కు వైజాగ్ గ్రామాలను మొట్ట మొదటి పొగ లేని గ్రామాలుగా ప్రకటించడానికి మార్గం సుగమం చేసింది.
దశాబ్దపు పాత రికార్డులను స్కాన్ చేసి డాక్యుమెంట్ చేయడం ద్వారా విలువైన ఆదాయ రికార్డులను భద్రపరచడంలో కీలకపాత్ర పోషించారు.
వాటిని కలెక్టరేట్ వద్ద ఆధునికీకరించి రికార్డు గదిలో భద్రపరిచారు.
ఇది పర్మినెంట్ రికార్డుగా జిల్లా యంత్రాంగానికి ఇప్పటికీ ఉపయోగపడుతుంది.
100 కు పైగా మీ సేవ కేంద్రాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వ సేవలను సులువు చేశారు.
అనంతరం వారు వైజాగ్ నుంచి బదిలీ అయి APIIC MDగా నియమింపబడ్డారు.
తన 5 నెలల సంక్షిప్త కాలంలో GVS ఆధారిత భూజాబితా వ్యవస్థను రూపొందించడం వంటి సంస్కరణలను చేశారు.
రాష్ట్రంలో వివిధ పరిపాలనా వ్యయాన్ని తగ్గించారు.
ఇది పారిశ్రామికవేత్తలకు తక్కువ ఖర్చుతో భూములు లభ్యత అయ్యేందుకు అవకాశం కలిగింది.
ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా నియమితులై కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడం ద్వారా మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను క్రమబద్దీకరించారు.
తద్వారా విజయవాడ కార్పోరేషన్ ను పరిశుభ్రమైన మిలియన్ నగరంగా నిలిపారు.
స్వచ్ఛ భారత్ లో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతు మీదుగా అవార్డు అందుకున్నారు.
సింగ్ నగర్ వద్ద మొట్ట మొదటి విజయవంతమైన బయోమైనింగ్ ప్రాజెక్టుకు నివాస్ మార్గదర్శకత్వం వహించారు.
డంప్ యార్డు కొరకు 30 ఎకరాల విలువైన భూమిని శాస్త్రీయంగా పొందారు.
50 శాతం వార్డులలో బిన్ ప్రీ భావనను అమలు చేశారు.
ఇది లిట్టర్ ప్రీ మరియు చెత్త లేని వార్డులను సృష్టించి ప్రజల ప్రశంసలు పొందారు.
విజయవాడ ప్రజలకు పరిశుభ్రమైన పర్యావరణహిత స్థలాన్ని సృష్టించడంపై ఆయన దృష్టి సారించారు.
మొట్ట మొదటి ఫ్లైఓవర్ పార్క్ యఫ్ హెచ్ 20 పార్క్ ను సృష్టించారు.
ఈ ఉద్యానవనం నెల రికార్డు కాలంలో సృష్టించబడింది.
మొట్టమొదటి రివర్ ఫ్యూపుడ్ కోర్టు, పిల్లల కోసం వినోద కేంద్రాన్ని PPP మోడల్లో తీసుకువచ్చారు.
ఇది విజయవాడ నగర పౌరులకు ప్రధాన హ్యాంగ్ అవుట్ స్థలంగా నిలిచింది.
కమిషనరుగా ఉన్న కాలంలో స్మార్ట్ సొల్యూషన్ కోసం ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డు ఇన్నోవేషన్ కోసం స్కోచ్ అవార్డు మరియు VITలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను అందుకున్నారు.
ఘన వ్యర్ధాల సేకరణతో పాటు, బయోగ్యాస్ ప్లాంటు, వికేంద్రీకృత కంపోస్టు ప్లాంటులు, వర్మి కంపోష్టు ప్లాంట్లతో సహా వ్యర్ధాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడానికి సౌకర్యాలను సృష్టించారు.
విజయవాడ ఆధునికీకరించిన పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చాలా మందిచే ప్రశంసించబడ్డాయి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పాఠశాల మరుగుదొడ్ల కొరకు ప్రామాణిక రూపకల్పనగా స్వీకరించబడింది.
ఆ తరువాత నివాస్ శ్రీకాకుళం కలెక్టర్ గా నియమితులై సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు.
IITలో ప్రవేశాల కోసం పేద SC విద్యార్ధులకు శ్రీకాకుళంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉపాధి హామీ పథకం అమలుపై దృష్టి సారించిన ఆయన ఉపాధి హామి పథకం అమల్లో ఉత్తమ జిల్లాగా జాతీయ అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఆయన ఈ నెల 9వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.