24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ ప్రతిపాదన..


దేశ ఆర్థిక పురోగతిని పరుగెత్తించేందుకు కరోనాకు వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. టీకా డ్రైవ్‌ను వేగవంతం చేసి సెప్టెంబర్ చివరకల్లా దేశంలో 70 కోట్ల మందికి టీకాలు వేయాలని పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, సెప్టెంబర్ కల్లా 70 కోట్ల మందికి టీకాలు అందాలంటే..113 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. రోజుకు 93 లక్షల మందికి టీకాలు వేస్తే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని కూడా సూచించింది. ప్రస్తుతం ఉన్న షిఫ్టులను రెండితలు చేయడం, వీలైతే వచ్చే రెండు నెలల పాటూ రోజులో 24 గంటలూ టీకాలు వేయడం ద్వారా రోజు కోటి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది.*

About The Author