ఈ టెక్నిక్ తో మీకు న‌చ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు


క‌రోనా కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన చాలా మంది ఎంట‌ర్ టైన్మెంట్ కోసం బ్రౌజింగ్ చేయ‌డమో లేదంటే టీవీ చూస్తుంటారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫాం ను వినియోగించే వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క‌క్లిక్ తో బోలెడ‌న్ని సినిమాల్ని వీక్షించ‌వ‌చ్చు. కానీ ఇక్క‌డొచ్చిన చిక్కేంటంటే మ‌న‌కు న‌చ్చిన జాన‌ర్ లో న‌చ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ ఎక్క‌డుందో వెతుక్కోవ‌డం కొంచెం క‌ష్టం. అందుకోసం కొంత స‌మ‌యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కోడ్స్ వినియోగించి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో మ‌న‌కు న‌చ్చిన సినిమాల‌ను చూడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫాం. ఆయా దేశాల్ని బ‌ట్టి ఓటీటీ ప్లాట్ ఫాం లోవీక్షించాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా పెద్ద‌గా ఉంటుంది. వాట‌న్నింటిని సుల‌భంగా చూసే సౌక‌ర్యంలోలేదు. ఒక్కో జానర్ క్లిక్ చేసుకుంటూ ఆ జాన‌ర్ లో మ‌న‌కు న‌చ్చిన సినిమాను చూడాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేలా నెట్ ప్లిక్స్ కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్ సాయంతో ఒక్క కోడ్ ను అప్ల్ చేసి యూజ‌ర్స్ ఏ జాన‌ర్ లో ఎంట‌ర్ టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఆ జాన‌ర్ సినిమాలు డైరెక్ట్ గా డిస్ ప్లే అవుతాయి. కావాలంటే మ‌నం ఆ ఫీచ‌ర్ ను వినియోగించుకోవ‌చ్చు.

నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్స్

యాక్షన్ & అడ్వెంచర్ (1365), ఇండియన్ మూవీస్ (10463), కామిక్ బుక్ అండ్ సూపర్ హీరో మూవీస్ (10118), క్రైమ్ యాక్షన్ & అడ్వెంచర్ (9584), పిల్లల పుస్తకాల ఆధారంగా సినిమాలు (10056), క్లాసిక్ వార్ మూవీస్ (48744), లేట్ నైట్ కామెడీస్ ( 1402), రొమాంటిక్ కామెడీస్ (5475), హిస్టారికల్ డాక్యుమెంటరీలు (5349), బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీలు (3652), రియ‌ల్ లైఫ్‌ సినిమాలు (3653), హర్రర్ మూవీస్ (42023), డిస్నీ మ్యూజికల్స్ (59433).

నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్‌లను ఎలా ఉపయోగించాలి?

మీరు నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్‌లను ఉపయోగించాలనుకుంటే మొదట బ్రౌజర్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యాక్షన్ లేదా మీకు న‌చ్చిన జానర్ సినిమాకు చెందిన లిస్ట్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసి URL ని కాపీ చేయాలి. URL ఉదాహార‌ణ‌కు ఇలా ఉంటుంది (https://www.netflix.com/browse/genre/action) ఇప్పుడు ఆ URL చివరి పదంలో పైన చూపించిన కోడ్ ల‌లో మీకు న‌చ్చిన జాన‌ర్ కోడ్ ను ఎంట‌ర్ చేయాలి. ఉదాహరణకు,మీరు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ & రెజ్లింగ్ (6695) కింద ట్యాగ్ చేయబడిన సినిమాలను చూడాలనుకుంటే, URL(https://www.netflix.com/browse/genre/6695 ) ఇలా ఉంటుంది. కావాలంటే ఒక్క‌సారి ట్రై చేయండి.

About The Author